వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అప్పుల కోసం బాబు బాటలో వైయస్: సిపియం
నెల్లూరు: ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి బాటలో నడిచే ప్రయత్నం చేస్తున్నారని సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు విమర్శించారు. డియఫ్ఐడి, ప్రపంచ బ్యాంక్ రుణాల కోసం వైయస్ ప్రభుత్వం పాకులాడుతోందని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
గత తెలుగుదేశం ప్రభుత్వం మాదిరిగానే షరతులను అంగీకరించి డియఫ్ఐడి, ప్రపంచ బ్యాంక్‌ల నుంచి అప్పులు తీసుకోవాలని వైయస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు. సంస్కరణల పేరుతో, షరతులతో ప్రపంచ బ్యాంక్, డియఫ్ ఐడిలతో ఒప్పందాలు చేసుకోవద్దని ఆయన డిమాండ్ చేశారు. షరతులతో రుణాలు తీసుకునే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను తాము ప్రతిఘటిస్తామని ఆయన చెప్పారు.
Story first published: Tuesday, May 17, 2005, 23:53 [IST]