వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు లెఫ్ట్‌ పూర్తి వ్యతిరేకం కాదు: నరేంద్ర

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌ను వామపక్షాలు నేరుగా వ్యతిరేకించడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్‌) నేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర అన్నారు. ఐక్య ప్రగతిశీల కూటమి (యుపి ఎ)తో పాటు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్‌డి ఎ) పక్షాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌కు అనుకూలంగా ఉన్నాయని ఆయన మంగళవారం విలేకరులతో అన్నారు. అతి త్వరలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన అన్నారు.

ప్రత్యేక తెలంగాణకు వామపక్షాలు పూర్తి అనుకూలంగా ప్రతిస్పందించబోవని తాము ముందు ఊహించామని, ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదని ఆయన అన్నారు. వామపక్షాలు సుముఖంగా లేవని తమకు మొదటి నుంచీ తెలుసునని ఆయన చెప్పారు. తెలంగాణ వెనకబడి ఉందనే విషయాన్ని సిపి ఐ అంగీకరించిందని, అందుకే ప్రత్యేక నిధులు కోరిందని ఆయన అన్నారు. సిపిఐ అభిప్రాయాలు తమకు అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X