• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జి-4 దేశాల వినతినిపరిశీలిస్తాం: అమెరికా

By Staff
|

వాషింగ్టన్‌:ఐక్యరాజ్యసమితిభద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్నికోరుతూ భారత్‌, మరో మూడు దేశాలతోకూడుకున్న జి-4 కూటమి పంపిన ప్రతిపాదనలనుపరిశీలించడానికి సిద్ధంగా ఉన్నట్టు అమెరికాతెలిపింది. అయితే ఇప్పటివరకు జపాన్‌కుశాశ్వత సభ్యత్వానికి కల్పించడానికే అమెరికాఅంగీకరించింది. భద్రతా మండలిని విస్తరించాలని..సభ్య దేశాల సంఖ్యను 15 నుంచి 25కి పెంచాలనికోరుతూ భారత్‌, బ్రెజిల్‌, జర్మనీ, జపాన్‌లు(జి-4 కూటమి) ముసాయిదా తీర్మానాన్ని పంపిణీచేసిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికావిదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రిచర్డ్‌ బౌచర్‌మాట్లాడుతూ అమెరికా ఇంతవరకు ఎలాంటినిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే ఈఅంశంలో విస్తృత ఏకాభిప్రాయానికే ప్రాధాన్యమిస్తామనితెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X