• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్నేహంపే తేల్చుకోవాల్సింది బాబే: ఇంద్రసేన్‌

By Staff
|

మహబూబ్‌నగర్‌: స్నేహంపై తేల్చుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడేనని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు ఎన్‌. ఇంద్రసేనారెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు విషయంలో ప్రజలను అయోమయానికి గురి చేయవద్దని ఆయన చంద్రబాబుకు సూచించారు. మిత్రపక్షమా, వ్యతిరేక పక్షమా తేల్చుకోవాల్సింది చంద్రబాబునాయుడేనని ఆయన శుక్రవారంనాడిక్కడ అన్నారు. బిజెపి తమ మిత్రపక్షం కాదని చంద్రబాబు అన్న మాటలపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు.

610 జీవోపై తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్‌ రావుకు అవగాహన లేదని ఆయన అన్నారు. నదీ జలాల పంపకం విషయంలో కృష్ణా ట్రిబ్యునల్‌ ముందు వాదనలు వినిపించడంలో మన ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. కర్ణాటక చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఏర్పడటం సిగ్గుచేటని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X