• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దమ్ముంటే వైయస్‌ను అడ్డుకోండి: టిడిపి

By Staff
|
కరీంనగర్‌: దమ్ముంటే తెలంగాణకు అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి పర్యటనలను అడ్డుకోవాలని తెలుగుదేశం నాయకుడు కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌)ను సవాల్‌ చేశారు. తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడి పర్యటనలను అడ్డుకోవాలని ప్రయత్నించడం టి ఆర్‌యస్‌ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు. గోదావరి జలాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ తెలంగాణకు అన్యాయం ఒడిగట్టినా టి ఆర్‌యస్‌ మాట్లాడకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.

610 జీవో అమలుపై టి ఆర్‌యస్‌ రాష్ట్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ఆయన అడిగారు. కరీంనగర్‌, మెదక్‌ జిల్లాలను జాతీయ ఆహారం పథకం కింద చేర్చకపోవడం టి ఆర్‌యస్‌ అధినేత, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్‌ రావు వైఫల్యమని ఆయన అన్నారు. తెలంగాణకు ఎవరేం చేశారో కరీంనగర్‌లో సభ పెట్టి తేల్చుకోవాలని ఆయన టి ఆర్‌యస్‌కు సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌, టి ఆర్‌యస్‌ నాయకులు పదవీ వ్యామోహంతో ఎన్నికలకు మందు ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయారని, పదవుల కోసం ప్రజలను రెచ్చగొట్టి మభ్యపెట్టారని ఆయన విమర్శించారు. పదవుల కోసమే తప్ప తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని కాంగ్రెస్‌, టి ఆర్‌యస్‌ నాయకులకు లేదని ఆయన అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more