దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  • search

నరసింహుడువిడుదలకు తొలగిన అడ్డంకులు

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    హైదరాబాద్‌:ఎన్టీఆర్‌ భారీ చిత్రం నరసింహుడు సినిమాకు ఏర్పడిన అడ్డంకులు తొలిగాయి. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో ఈ సినిమా శుక్రవారం సాయంత్రం విడుదలవుతుంది. ఇతర ప్రాంతాల్లో శనివారం విడుదలవుతుంది.

    శుక్రవారంఉదయం నర్సింహుడు సినిమావిడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఉదయంనుంచే థియేటర్ల వద్ద బారులు తీరిన ఎన్టీఆర్‌అభిమానులు రాష్ట్రంలోనివివిధ పట్టణాల్లో విధ్వంసానికి దిగారు.నిర్మాత చెంగల వెంకటరావు ఆరు కోట్లరూపాయలు బకాయి పడినందువల్లప్రింట్లు ఇవ్వడానికి నిరాకరించడంతో ఈసంక్షోభం ఏర్పడింది. రామానాయుడు స్టూడియోలో నిర్మాతకు,ఫైనాన్షియర్స్‌కు, ఎగ్జిబిటర్లకు మధ్య చర్చలుజరుగుతున్నాయి. ఈ సినిమాసంక్షోభంలో పడడంతో ఎన్టీఆర్‌ఆత్మహత్య చేసుకున్నారన్నవదంతులు వ్యాపించాయి. ఈవదంతులను ఎన్టీఆర్‌ కార్యాలయవర్గాలు ఖండించాయి. ప్రస్తుతం బెంగుళూరులో ఉన్న ఆయనకొద్ది సేపట్లోహైదరాబాద్‌ వ స్తారని తెలిపాయి. ఈరోజుఎన్టీఆర్‌ జన్మదినం కావడంతో నరసింహుడుసినిమాను నేడువిడుదల చేయాలని నిర్ణయించారు. ఎన్టీఆర్‌గత చిత్రాలు ఆంధ్రావాలా, నా అల్లుడుఫ్లాప్‌ కావడంతో నరసింహుడుసినిమాపై ఎన్టీఆర్‌, ఆయన అభిమానులు ఎన్నోఆశలు పెట్టుకున్నారు.

    నర్సింహుడు చిత్రాన్ని 20 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే 8 కోట్ల రూపాయల లోటు ఏర్పడింది. రామానాయుడు స్టూడియోలో జరిగిన చర్చల్లో లోటు కోటి రూపాయలకు తగ్గింది. ఈ మొత్తానికి సంబంధించిన వ్యవహారం తేలితే సినిమా విడుదలకు మార్గం సుగమం అవుతుంది. రామానాయుడు స్టూడియోలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆందోళనకు దిగారు. రామానాయుడు స్టూడియో వద్దకు పెద్ద యెత్తున అభిమానులు చేరుకున్నారు. వారు పెద్ద యెత్తున నినాదాలు చేస్తున్నారు.

    కర్నూలులో ఎన్టీ ఆర్‌ అభిమానులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఎన్టీ ఆర్‌ అభిమానులను తరిమికొట్టారు. ఆందోళనకారులు ఒక ఆర్టీసి బస్సుపై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. నర్సింహుడు సినిమాను 300 ప్రింట్లతో 500 కేంద్రాల్లో శుక్రవారం విడుదల చేయాలని నిర్ణయించారు. ఆర్థిక లావాదేవీల కారణంగా విడుదలకు బ్రేక్‌ పడడంతో ఎన్టీ ఆర్‌ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లోని థియేటర్ల వద్దకు పెద్ద యెత్తున ఎన్టీ ఆర్‌ అభిమానులు తరలివచ్చారు. సినిమా విడుదల కాకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రింట్లు రాకపోవడంతో సినిమా ఆడించడం లేదని థియేటర్‌ యజమానులు అంటున్నారు.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more