• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గల్ఫ్‌లోని తెలుగువారికి దుబాయ్‌లో కార్యాలయం

By Staff
|

హైదరాబాద్‌: గల్ఫ్‌ దేశాల్లోని కార్మికుల సౌకర్యం కోసం దుబాయ్‌లో ఒక సమాచార కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర కార్మిక మంత్రి జి. వినోద్‌ చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి గల్ఫ్‌ దేశాల్లోని తెలుగువారికి ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని ఆయన సోమవారం నాడు చెప్పారు.

హైదరాబాద్‌లో ఇయస్‌ ఐ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కొత్తగా 9 జిల్లాల్లో ఇయస్‌ఐ కార్యకలాపాలను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఎన్నడూ లేని విధంగా తాము 9 వేతన బోర్డులను పునరుద్ధరించామని ఆయన చెప్పారు. 8 వేల మంది బాలకార్మికులకు విముక్తి కలిగించినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X