• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జెసి, రఘువీరా, బోయలకు ఈసీ నోటీసులు

By Staff
|

అనంతపురం: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఎన్నికల సంఘం రాష్ట్ర మంత్రులు జె.సి. దివాకర్‌ రెడ్డి, రఘువీరారెడ్డిలకు, కాంగ్రెస్‌ అభ్యర్థి బోయ శ్రీరాములుకు నోటీసులు జారీ చేసింది. అనంతపురం జిల్లా కలెక్టర్‌ అనురాధ ఈ నోటీసులు జారీ చేశారు. మంత్రులకు మూడేసి నోటీసులు జారీ అయ్యాయి.

పెనుకొండ శాసనసభా నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భారీ కాన్వాయ్‌ని వాడినందుకు, ప్రజలకు కొత్త పథకాలను ప్రకటించినందుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుకు వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం వారిని ఆదేశించింది. మంత్రుల వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి కూడా సమాయత్తమవుతున్నట్లు సమాచారం. రాష్ట్ర మంత్రులు దివాకర్‌ రెడ్డి, రఘువీరా రెడ్డి ఎన్నికల ప్రవర్తనానియమావళిని ఉల్లంఘించారంటూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X