• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్రేడ్‌ యూనియన్లను వ్యతిరేకించలేదు: చంద్రబాబు

By Staff
|

హైదరాబాద్‌: తాము ట్రేడ్‌ యూనియన్లను ఎప్పుడూ వ్యతిరేకించలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈ విషయంపై తెలుగుదేశం మహానాడులో ఒక తీర్మానం చేశారు. పరిశ్రమల్లో ట్రేడ్‌ యూనియన్‌ కార్మికులు భాగస్వాములు కావాలనేది, లాభాల్లో కార్మికులకు వాటా దక్కాలనేది తమ సిద్ధాంతమని ఆయన అన్నారు. ఆర్టీసిని ప్రైవేటీకరించాలని తమ ప్రభుత్వ హయాంలో ఏనాడూ ప్రయత్నించలేదని, ఆర్టీసి సమర్ధతను పెంచడానికి కొన్ని చర్యలు తీసుకున్నామని, కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందిందని ఆయన అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని తమపై ఆ కాలంలో ఒత్తిడి వచ్చినా తాము తలొగ్గలేదని ఆయన అన్నారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించి కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్మికులను, ఉద్యోగులను మోసం చేస్తోందని టిడిపి నేత ఎస్‌. వేణుగోపాలాచారి అన్నారు. మూడు నెలల్లోనే వేతన సవరణ సంఘం వేస్తానని చెప్పి పది నెలలు తీసుకందని, వేతన సవరణ సంఘం 15 శాతం సిఫార్సు చేస్తే ప్రభుత్వం 10 శాతానికి తగ్గించిందని ఆయన అన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్‌ డబ్బులు దండుకుంటోందని తెలుగుదేశం పార్టీ మరో తీర్మానంలో విమర్శించింది. ఎగువ రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకోకపోతే మన రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది.

రైతుల పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన మరో తీర్మానంపై మాట్లాడుతూ అన్నారు. ధరల పెరుగుదలపై ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X