వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్బన్‌ బ్యాంకులపై వైయస్‌తో లీలాధర్‌ భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలోని అర్బన్‌ సహకార బ్యాంకుల పటిష్టతకు రిజర్వ్‌ బ్యాంక్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అవగాహన కుదిరింది. ఈ అవగాహనా ఒప్పందంపై ఇరు పక్షాలు త్వరలో సంతకాలు చేస్తాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ డిప్యూటీ గవర్నర్‌ లీలాధర్‌ మంగళవారంనాడు ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డితో సమావేశమయ్యారు. రిజర్వ్‌ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అంగీకరించారు. రిజర్వ్‌ బ్యాంక్‌తో ఈ విధమైన ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అవుతుంది.

రాష్ట్రంలోని చాలా అర్బన్‌ సహకార బ్యాంకులు మూతపడ్డాయి. అర్బన్‌ సహకార బ్యాంకులు ఈ విధంగా మూతపడకుండా, డిపాజిటర్ల సొమ్ముకు భద్రత కల్పించడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని లీలాధర్‌ మీడియా ప్రతినిధులతో చెప్పారు. టాస్క్‌ఫోర్స్‌ ద్వారా రాష్ట్రంలోని అర్బన్‌ సహకార బ్యాంకుల ఆర్థిక పరిస్థితిపై పరిశీలన జరిపిస్తామని, ఈ టాస్క్‌ఫోర్స్‌ మూడు నెలల్లో నివేదిక సమర్పిస్తుందని ఆయన చెప్పారు. కంప్యూటరైజేషన్‌, శిక్షణ వంటివి కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉంటాయని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X