• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విహెచ్‌పి మా జోలికి రావద్దు: వెంకయ్య

By Staff
|
చెన్నై: ఎల్‌.కె. అద్వానీ రాజకీయాల నుంచి తప్పుకోవాలని విశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పి) చేసిన డిమాండ్‌ను భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు తిరస్కరించారు. తమ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విహెచ్‌పికి సలహా ఇచ్చారు. తమ పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించుకోవాలనే విషయాన్ని తమ పార్టీ చూసుకుంటుందని, ఈ విషయంలో విహెచ్‌పి జోక్యం చేసుకోవడం మంచిది కాదని ఆయన అన్నారు. తమది ప్రజాస్వామిక, జాతీయ రాజకీయ పార్టీ అని, తమ వ్యవహారాలను చక్కబెట్టుకునే శక్తి తమకు ఉన్నదని ఆయన అన్నారు.

విహెచ్‌పి సలహాలు లేదా డిమాండ్లు తమకు అంగీకారయోగ్యం కావని ఆయన అన్నారు. హిందూత్వకు, జాతీయతకు అద్వానీ చేసిన సేవలు గణనీయమైనవని, ప్రజా జీవితంలో ఉత్తమ విలువలకు అద్వానీ ప్రతీకగా నిలిచారని, అద్వానీ నాయకత్వంలో బిజెపి లాభపడిందని ఆయన అన్నారు. ఓటు బ్యాంకు కోసం రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తున్న కుహనా లౌకికవాదం వెన్ను విరచడంతో పాటు లౌకికవాదానికి సరైన అర్థం చెప్పిన నాయకుడు అద్వానీ అని ఆయన కొనియాడారు.

పార్టీ నాయకులందరి విజ్ఞప్తి మేరకే అద్వానీ బిజెపి అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకున్నారని, విహెచ్‌పి డిమాండ్‌ను అద్వానీ అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. పాకిస్థాన్‌లో మహమ్మద్‌ అలీ జిన్నాపై అద్వానీ చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆయన చెప్పారు. జిన్నాపై అద్వానీ చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదం ముగిసిపోయిందని, దాని గురించి మళ్లీ చర్చించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more