• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మద్దతు కోసం అద్వానీతో కెసిఆర్‌ బృందం భేటీ

By Staff
|
న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణకు మద్దతు కూడగట్టడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌) నేత, కేంద్ర కార్మిక మంత్రి కె. చంద్రశేఖర్‌ రావు నేతృత్వంలోని బృందం బుధవారం సాయంత్రం భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు ఎల్‌.కె. అద్వానీని కలిసింది. బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో అద్వానీని టి ఆర్‌యస్‌ నాయకులు కలిశారు. ఆయనతో దాదాపు 40 నిమిషాల పాటు వారు సమావేశమయ్యారు. కెసి ఆర్‌తో పాటు కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర, టి ఆర్‌యస్‌ సిద్ధాంత కర్త జయశంకర్‌, మధుసూదన్‌ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు వినోద్‌కుమార్‌ అద్వానీని కలిసినవారిలో ఉన్నారు.

తెలంగాణపై తమ పార్టీ విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఇందుకు పార్టీ సమావేశంలో చర్చిస్తామని అద్వానీ కెసిఆర్‌తో చెప్పినట్లు సమాచారం. అనంతరం చంద్రశేఖర్‌ రావు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మోతీలాల్‌ వోరాను కలిశారు.

అద్వానీతో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడకుండానే కెసి ఆర్‌ వెళ్లిపోయారు. అద్వానీని కలిసిన అనంతరం నవ్వుతూ బయటకు వచ్చిన ఆయన మీడియా ప్రతినిధుల వైపు చేయి ఊపుతూ వెళ్లిపోయారు. కెసి ఆర్‌ బృందం మంగళవారంనాడు మాజీ ప్రధాని వాజ్‌పేయిని కలిసి మద్దతును అర్థించారు. ప్రత్యేక తెలంగాణ అంశం లోక్‌సభలో వచ్చినప్పుడు తాము బలపరుస్తామని వాజ్‌పేయి హామీ ఇచ్చినట్లు కెసి ఆర్‌ చెప్పారు. తెలంగాణ ఎప్పుడో ఏర్పడాల్సి ఉందని వాజ్‌పేయి అన్నట్లు కూడా ఆయన తెలిపారు. వాజ్‌పేయితో భేటీ అయిన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కెసి ఆర్‌ అద్వానీతో భేటీ అనంతరం మాట్లాడకపోవడం విస్మయానికి గురి చేసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more