• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహారాష్ట్రపై కేంద్రానికి ఫిర్యాదుకు ఎపి నిర్ణయం

By Staff
|

హైదరాబాద్‌: గోదావరి నదిపై మహారాష్ట్ర నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహారాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని మొదట ప్రభుత్వం అనుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారా అని సుప్రీంకోర్టు అడిగితే సమాధానం చెప్పడానికి ఏమీ ఉండదనే ఉద్దేశంతో మొదట కేంద్రానికి ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య శనివారంనాడు అందుకు గాను ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీలో ఆయన కేంద్ర జలవనరుల మంత్రి ప్రియరంజన్‌దాస్‌ మున్షీని కలిసి మహారాష్ట్ర ప్రాజెక్టులపై ఫిర్యాదు చేస్తారు.

ఇదిలావుంటే, గోదావరి నదిపై మహారాష్ట్ర నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును ఆపించడానికి చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపి ఐ) ప్రతినిధి బృందం బుధవారం ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి కోరింది. సిపి ఐ రాష్ట్ర కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి, పువ్వాడ నాగేశ్వరరావు, చాడ వెంకటరెడ్డి తదితరులు ముఖ్యమంత్రిని కలిసి ఆ మేరకు విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర ప్రాజెక్టులు పూర్తయితే గోదావరినది ఎండిపోతుందని, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కింద స్థిరీకరణ జరిగిన ఆయకట్టుకు కూడా నీరందదదని వారు ముఖ్యమంత్రికి తెలియజేశారు. గోదావరినదిపై మహారాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే మన ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయని వారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X