వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెట్రో ధరల పెంపుపై వామపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ/ హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా జాతీయ స్థాయిలో తలపెట్టిన ఆందోళనలో భాగంగా రాష్ట్రంలో వామపక్షాలు మంగళవారం నిరసన కార్యమ్రాలు చేపట్టాయి. పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని చార్మినార్ చౌరస్తా వద్ద సిపియం ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. ఈ కార్యక్రమంలో సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులుతో పాటు కొరటాల సత్యనారాయణ వంటి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
లారీ యజమానుల సంఘం కూడా మంగళవారం ఆందోళనకు దిగింది. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడా, కోదాడ తదితర ప్రాంతాల్లో లారీ ఓనర్ల సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకోలు జరిగాయి. విజయవాడలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. విశాఖపట్నంలో సిపియం కార్యకర్తలు రైల్‌రోకో నిర్వహించారు. నల్లగొండ జిల్లా నక్రేకల్‌లో సిపియం శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది.
దేశవ్యాప్తంగా నాలుగు వామపక్షాల యాక్షన్ డేకు పెద్ద యెత్తున ప్రతిస్పందన లభించలేదు. వామపక్ష పాలిత రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, కేరళల్లో ఆందోళన ప్రభావం ఎక్కువగా కనిపించింది. న్యూఢిల్లీలో వామపక్షాల కార్యకర్తలు బారికేడ్లను ఛేదించుకుని రోడ్లపై పడిపోయారు. అయినా ప్రైవేట్ వాహనాలు తిరుగుతూ కనిపించాయి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!