వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అద్వానీ రాజీనామాను ఆర్‌యస్‌యస్ అడుగలేదు
న్యూఢిల్లీ: పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌యస్‌యస్) ఎల్.కె. అద్వానీకి సూచించలేదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికార ప్రతినిధి సుష్మా స్వరాజ్ చెప్పారు. అద్వానీ పూర్తి కాలం అధ్యక్షుడిగా కొనసాగుతారని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అద్వానీని రాజీనామా చేయాలని ఎప్పుడూ అడగలేదని, ఈ విషయంలో పార్టీలో గానీ పరివార్‌లో గానీ ఏ విధమైన అయోమయం లేదని ఆమె అన్నారు.
ఒక వ్యక్తి ఒకే పదవిలో ఉండాలనే విషయంపై కూడా ఆర్‌యస్‌యస్ పట్టుబట్టలేదని ఆమె అన్నారు. మీడియానే ఊహాగానాలు చేసిందని ఆమె అన్నారు. బిజెపి ఆఫీస్ బియరర్ల సమావేశం అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు, ప్రధాన కార్యదర్శులు ప్రమోద్ మహాజన్, రాజ్‌నాథ్ సింగ్, అనంతకుమార్, బాల్ ఆప్టే, వి.కె. మల్హోత్రా పాల్గొన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!