• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జూ. డాక్టర్ల నేతల అరెస్టు: పియస్‌ ముట్టడి

By Staff
|

హైదరాబాద్‌: సమ్మె చేస్తున్న జూనియర్‌ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ సురేష్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి హైదరాబాద్‌లోని అంబర్‌ పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. జూనియర్‌ డాక్టర్ల నేతలను నిర్బంధించిన అంబర్‌పేట పోలీసు స్టేషన్‌ను జూనియర్‌ డాక్టర్లు ముట్టడించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జూనియర్‌ డాక్టర్ల సమ్మెపై విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. జూనియర్‌ డాక్టర్ల హాస్టళ్లను మూసివేయడానికి ప్రభుత్వం తమ పేరును వాడుకోవడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. తాము హాస్టళ్లు మూసేయాలని చెప్పలేదని స్పష్టం చేసింది.

ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌ను అధ్యయనం చేయడానికి జూనియర్‌ డాక్టర్ల సంఘం తరఫు న్యాయవాది రెండు రోజుల గడువు అడిగారు. అందుకు హైకోర్టు తిరస్కరించింది. జూనియర్‌ డాక్టర్ల సమ్మెపై ఎస్మాను ఎందుకు ప్రయోగించారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సమస్య పరిష్కారానికి వాదప్రతివాదనలు జరుగుతుండగా సమ్మెకు ఎందుకు దిగారని హైకోర్టు ప్రశ్నించగా ప్రజల సంక్షేమం కోసమేనని జూనియర్‌ డాక్టర్ల తరఫు న్యాయవాది చెప్పారు. ఏడాదికి 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. జూనియర్‌ డాక్టర్ల డిమాండ్లను కొన్నింటిని పరిష్కరించామని, అన్ని డిమాండ్ల పరిష్కారం ఒక రోజులో అయ్యే పని కాదని, కొంత సమయం పడుతుందని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.

జూనియర్‌ డాక్టర్లు జైలో భరో కార్యక్రమాన్ని చేపట్టింది. మంగళవారం ఉస్మానియా వైద్య కళాశాల వద్ద జూనియర్‌ డాక్టర్లకు, పోలీసులకు మధ్య వివాదం చెలరేగింది. జూనియర్‌ డాక్టర్లకు మద్దతుగా వచ్చిన ప్రగతిశీల మహిళా సంఘం నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూనియర్‌ డాక్టర్లను కూడా అరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X