• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బొత్సా సత్యనారాయణకు మార్కెటింగ్‌ శాఖ

By Staff
|

హైదరాబాద్‌: బొత్సా సత్యనారాయణకు ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి మార్కెటింగ్‌ శాఖను అప్పగించారు. వోక్స్‌ వ్యాగన్‌ వ్యవహారంలో భారీ పరిశ్రమల శాఖ నుంచి బొత్సా సత్యనారాయణను మరో శాఖకు మారుస్తామని ముఖ్యమంత్రి ఇది వరకు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు బొత్సాకు మార్కెటింగ్‌ శాఖను అప్పగించారు. ఈ విషయం వెల్లడి కావడానికి ముందు బొత్సా సత్యనారాయణ సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రితో ఆయన పదిహేను నిమిషాల పాటు ఉన్నారు.

మార్కెటింగ్‌ శాఖను అప్పగిస్తున్న విషయం తెలియజేస్తూ ఈ శాఖను చక్కగా నిర్వహించుకోవాల్సిందిగా రాజశేఖర్‌ రెడ్డి బొత్సా సత్యనారాయణకు సూచించినట్లు సమాచారం. మీడియా వద్ద జాగ్రత్తగా ఉండాలని, అనవసరంగా నోరు పారేసుకోవద్దని ఆయన సత్యనారాయణకు సూచించినట్లు సమాచారం. బొత్సా సత్యనారాయణ శాఖ మారిస్తే సరిపోదని, ఆయనను మంత్రి వర్గం నుంచి తప్పించాలని తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో పాటు మిత్రపక్షాలైన వామపక్షాలు కూడా గొంతు కలుపుతున్నాయి. అయినా వెనుకంజ వేయకుండా బొత్సాకు మార్కెటింగ్‌ శాఖను అప్పగించారు. ఈ నెల 19వ తేదీన వైయస్‌ ఢిల్లీ వెళ్తున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గం వద్ద ఈ వ్యవహారానికి సంబంధించి తన చర్యలను సమర్థించుకునే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X