వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సల్మాన్‌ సినిమా ప్రదర్శనకు ఆటంకాలు

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌/ పూణే/ భోపాల్‌: అండర్‌ వరల్డ్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌పై దేశవ్యాప్తంగా నిరసన పెల్లుబుకుతోంది. సల్మాన్‌ ఖాన్‌ నటించిన మైనే ప్యార్‌ క్యొయ్‌ కియా సినిమా ప్రదర్శనను ఆందోళనకారులు అడ్డుకున్నారు. గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఏర్పడ్డాయి.

ఈ సినిమా ప్రదర్శను అహ్మదాబాద్‌లోనూ, భరూచ్‌ జిల్లాలోనూ విశ్వహిందూ పరిషత్‌, భజరంగదళ్‌ కార్యకర్తల నిరసనతో తాత్కాలికంగా నిలిపేశారు. భజరంగదళ్‌ కార్యకర్తలు సినిమాకు నినాదాలు చేస్తూ సినిమా పోస్టర్లను చింపేశారు. దీంతో ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద బందోబస్తు పెంచారు. పూణేలో బిజెపి యువమోర్చా కార్యకర్తల నిరసనతో పూణేలో ఈ సినిమా ప్రదర్శను బ్రేక్‌లు పడ్డాయి. సినిమా ప్రదర్శనకు వ్యతిరేకంగా నాసిక్‌లో ఆందోళన చేపట్టిన బిజెపి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి. ఇండోర్‌, జబల్‌పూర్‌, గ్వాలియర్‌ వంటి నగరాల్లో భజగరంగదళ్‌ కార్యకర్తలు ప్రదర్శనలు చేపట్టారు. దీంతో ఆ సినిమా ప్రదర్శన నిలిచిపోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X