• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నిరంకుశ అధికారుల చేతుల్లోకి పాలన: సిపియం

By Staff
|

హైదరాబాద్‌: రాష్ట్రంలో పాలన నిరంకుశ అధికారుల చేతుల్లో వెళ్లే ప్రమాదం పొంచి వుందని సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిని హెచ్చరించారు. ప్రజాసమస్యలను విన్నవించడానికి మంత్రి అందుబాటులో లేకపోవడం విడ్డూరమని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రేషన్‌ కార్డుల కోసం, ఇళ్ల పట్టాల కోసం తాము నిరవధిక నిరాహారదీక్ష చేస్తుంటే మంత్రి కూడా లేరని ఆయన అన్నారు.

అవినీతి అభియోగాల వల్ల ఇద్దరు మంత్రుల శాఖలు మారాయని, చాలా శాఖలు ముఖ్యమంత్రి వద్దనే ఉన్నాయని, ఈ స్థితిలో ప్రజాసమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన అన్నారు. తమ నిరాహారదీక్షకు అన్ని రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి మున్సిపాలిటీల్లో నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X