• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైయస్‌కు ఎదురు తిరుగుతారనే భయం: ఎర్రం

By Staff
|

హైదరాబాద్‌: భయంతోనే ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులను డిస్మిస్‌ చేయడం లేదని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టిడిపిపి) నేత కె. ఎర్రంనాయుడు వ్యాఖ్యానించారు. గత 14 నెలల కాలంలో జరిగిన కుంభకోణాలన్నింటిలో ముఖ్యమంత్రి పాత్ర ఉందని, డిస్మిస్‌ చేస్తే అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులు ఎదురుతిరిగి తనపై ఎదురు తిరుగుతారని ముఖ్యమంత్రి భయపడుతున్నారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. భయంతోనే ముఖ్యమంత్రి మంత్రుల శాఖలను మారుస్తున్నారే గానీ డిస్మిస్‌ చేయడం లేదని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి కుంభకోణాలమయంగా మారిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వోక్స్‌వ్యాగన్‌ వ్యవహారంలో 11 కోట్ల రూపాయలు లెక్కాపత్రం లేకుండాపోతే అదేదో చిన్న వ్యవహారం అయినట్లు ముఖ్యమంత్రి చిన్నచూపు చూస్తున్నారని ఆయన అన్నారు. వోక్స్‌ వ్యాగన్‌ వ్యవహారంలో మంత్రి బొత్సా సత్యనారాయణను డిస్మిస్‌ చేయాలని తామే కాదు, సిపిఐ, సిపియంలు కూడా డిమాండ్‌ చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని పథకాలన్నింటికీ రాజీవ్‌, ఇందిర పేర్లు పెట్టి ముఖ్యమంత్రి తన పదవిని కాపాడుకుంటున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X