• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సల్మాన్‌ను విచారించిన పోలీసులు: తమ్ముడి అండ

By Staff
|

ముంబాయి: అండర్‌ వరల్డ్‌తో సంబంధాలున్నాయని, సినీనటి ఐశ్వర్యారాయ్‌ను బెదిరించాడని ఆరోపణలను ఎదుర్కుంటున్న ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ను ముంబాయి పోలీసులు విచారించారు. అయితే తన అన్న సల్మాన్‌కు తమ్ముడు సొహైల్‌ అండగా నిలిచాడు. పోలీసులకు చిక్కాయని చెబుతున్న టేప్‌ల్లోని గొంత తన అన్న సల్మాన్‌ది కాదని ఆయన అన్నారు. తమకు అండర్‌ వరల్డ్‌తో సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తమకే అండర్‌ వరల్డ్‌ ముప్పు ఉందని కట్టుదిట్టమైన భద్రత మధ్య తిరుగుతున్నామని ఆయన అన్నారు.

అండర్‌వరల్డ్‌ నుంచి తమకు కూడా బెదిరింపులు వచ్చాయని ఆయన అన్నారు. తన అన్న నటించిన సినిమాల ప్రదర్శనను అడ్డుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఇదంతా రాజకీయాల పని ఆయన తప్పు పట్టారు. సల్మాన్‌ సినిమాలను ప్రజలు చూడకపోతే వేరే విషయమని, ప్రజలు చూస్తున్నారని ఆయన చెప్పారు. గొడవంతా రాజకీయ పార్టీల వల్లనే వస్తోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X