వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వోక్స్‌వ్యాగన్ వ్యవహారంపై టిడిపి 22ప్రశ్నలు
హైదరాబాద్: వోక్స్ వ్యాగన్ వ్యవహారంపై ప్రభుత్వం అసత్య ప్రచారానికి పాల్పడుతోందని తెలుగుదేశం నాయకులు డాక్టర్ ఎం.వి. మైసురారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, కంభంపాటి రామమోహన్ రావు విమర్శించారు. వోక్స్ వ్యాగన్ వ్యవహారంపై వారు ఆదివారంనాడు ప్రభుత్వానికి 22 ప్రశ్నలు సంధించారు. వాస్తవాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం అసత్య ప్రకటనలు ఇస్తోందని వారన్నారు.
ఎలాంటి కేటాయింపులు జరపకుండా, మంత్రివర్గ సమావేశంలో చర్చించకుండా వోక్స్ వ్యాగన్ పేరు మీద వశిష్ట వాహన్‌కు 11 కోట్ల రూపాయలు ఎలా చెల్లించారని వారు ప్రభుత్వాన్ని అడిగారు. ఈ 11 కోట్ల రూపాయలు దేశం దాటి పోవడం ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి, మంత్రి బొత్సా సత్యనారాయణకు, అధికారులకు తెలుసునని వారన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!