• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చర్చలతో కెసిఆర్‌, వైయస్‌ ఏం సాధించారు?: బాబు

By Staff
|

విశాఖపట్నం: ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్‌) నేత కె. చంద్రశేఖర్‌ రావు చర్చల ద్వారా సాధించిందేమిటో ఎవరికీ అర్థం కావడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, టి ఆర్‌యస్‌ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన అన్నారు. విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి జ్వరపీడితులను పరామర్శించి చంద్రబాబు శుక్రవారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాంగ్రెస్‌, టి ఆర్‌యస్‌ల సృష్టిస్తున్న అయోమయం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని ఆయన అన్నారు. తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోవడం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని ఆయన విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు జ్వరాలతో మరణిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ నిద్ర పోతోందని ఆయన ఆయన విమర్శించారు. పేదవాళ్లతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ఆయన అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మరణాలు సంభవించలేదని ప్రభుత్వం చేసిన ప్రకటనను ఆయన తప్పు పట్టారు. ఏ గ్రామాల్లో ఎంత మంది మరణించారో తాను వివరాలు ఇవ్వగలనని ఆయన అన్నారు. గిరిజనులు నోళ్లు లేనివారు కావడంతో వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X