• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    పెద్దవాళ్లు చెప్పినా తప్పు చేయవద్దు: వైయస్‌

    By Staff
    |
    హైదరాబాద్‌: ఎంత పెద్దవారు ఒత్తిడి తెచ్చినా తప్పు పనులు చేయవద్దని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. శుక్రవారంనాడిక్కడ ఏర్పాటయిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి అందుకు అనుగుణంగా పని చేస్తున్నందుకు ఆయన కలెక్టర్లను అభినందించారు. వారానికి ఒక్కసారైనా గ్రామాల్లో పర్యటించాలని ఆయన వారికి సూచించారు. జిల్లా అధికారులు వారానికి ఒక్కసారైనా గ్రామాల్లో బస చేయాలని ఆయన అన్నారు.

    ప్రభుత్వం తలపెట్టిన పనులన్నీ నాలుగేళ్లలో పూర్తి చేయాలని, లేకుంటే విశ్వసనీయత కోల్పోతామని ఆయన అన్నారు. ప్రజల ఇబ్బందులు తీర్చడానికి వారి వద్దకు వెళ్లడానికి భయపడకూడదని, వారు కష్టాల్లో ఉన్పప్పుడే మనం వారి వద్దకు వెళ్లాలని ఆయన అన్నారు. వర్షపాతం తక్కువ ఉన్న ప్రస్తుత స్థితిలో ప్రజల కష్టాలు తీర్చడానికి కృషి చేయాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, అభివృద్ధి నడకలాగా కాకుండా పరుగులాగా జరగాలని ఆయన అన్నారు. అభివృద్ధి లెక్కలు తమకు అవసరం లేదని, వాస్తవంగా అభివృద్ధి ఎంత జరిగిందనేదే ముఖ్యమని ఆయన అన్నారు.

    మిరపకు రూ. 2400కు మించి ఇవ్వలేమని చెప్పామని, ఒక వైపు సబ్సిడీలు ఇస్తూ మరో వైపు ఎక్కువ ధరలు ఇవ్వడం సాధ్యం కాదని ఆయన అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ అందించే విషయంలో కొందరు విమర్శల కోసమే విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. గుండె జబ్బు పిల్లలకు ఎన్ని కోట్లయినా సరే వెచ్చించి శస్త్రచికిత్సలు చేయిస్తామని ఆయన చెప్పారు. గత 12 యేళ్లుగా గుండెజబ్బు పిల్లలను పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధులు సోకుతున్న మాట వాస్తవమేనని, అనారోగ్య నివారణకు శాశ్వత ప్రాతిపదికపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. గిరిజనుల ఆహార భద్రతకు చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్లకు సూచించారు.

    సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ జరిపే విషయంలో జాప్యం చేయవద్దని ఆయన సూచించారు. భూసేకరణ విషయంలో ఎవరైనా రెచ్చగొట్టినా, అనవసర రాజకీయాలకు పాల్పడినా అరెస్టు చేయడానికి వెనుకాడవద్దని ఆయన సూచించారు. భూసేకరణలో న్యాయసమస్యలు తలెత్తకుండా పరస్పర అవగాహనతో పరిష్కారం సాధించాలని ఆయన సూచించారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more