• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

14 నెలల తర్వాత సచివాలయానికి బాబు

By Staff
|

హైదరాబాద్‌: దాదాపు 14 నెలల విరామం తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సచివాలయానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన సచివాలయంలో అడుగు పెట్టలేదు. రాష్ట్ర మానవ హక్కుల సంఘం నియామకంపై చర్చించడానికి ఆయన సచివాలయం వచ్చారు. ఈ సందర్భంగా సచివాలయంలోని సమత బ్లాక్‌ వద్ద హడావిడి నెలకొంది.

ముఖ్యమంత్రిగా తాను కూర్చున్న ఛేంబర్‌లోనే గురువారంనాటి సమావేశం ఏర్పాటయింది. ప్రతిపక్ష నాయకుడిగా మానవ హక్కుల సంఘం నియామకం గురించి చర్చల్లో పాల్గొనడానికి ఆయన సచివాలయం వచ్చారు. రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఏర్పాటు ప్రతిపాదన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి, హోం మంత్రి కె. జానారెడ్డి, స్పీకర్‌ సురేష్‌ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు, తెలుగుదేశం శాసనసభా పక్షం ఉపనాయకుడు నాగం జనార్దన్‌ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.

మానవ హక్కుల కమీషన్‌ నియామకం తీరుపై చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కమీషన్‌ నియామకంపై ముందే ఒక నిర్ణయానికి వచ్చారని, నియామకం గురించి చర్చించకుండా ముఖ్యమంత్రి చైర్మన్‌ పేరును, జానా రెడ్డి ఒక సభ్యుడి పేరును, ముఖ్యమంత్రి మరో సభ్యుడి పేరును వెల్లడించారని ఆయన చెప్పారు. ముందే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత తమను పిలవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. సమావేశం ప్రారంభమైన తర్వాత 15 నిమిషాలకే ఆయన బయటకు వచ్చారు. కమీషన్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ న్యాయమూర్తి సుభాషణ్‌ రెడ్డిని నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X