• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రోశయ్య బహిరంగ క్షమాపణ చెప్పాలి: టిడిపి

By Staff
|

హైదరాబాద్‌: ఏజెన్సీ ప్రాంతాల ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడిన ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి కె. రోశయ్య బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు, డాక్టర్‌ ఎం.వి. మైసురారెడ్డి, బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్‌ చేశారు. విశాఖ మన్యంలో 1094 మంది మలేరియా, ఇతర విషజ్వరాలకు మరణించారని, దీన్ని తాము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని వారు గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

ఏజెన్సీ మరణాలపై ఐక్య రాజ్యసమితికి కూడా ఫిర్యాదు చేసుకోవవచ్చునని మాట్లాడడం ద్వారా రోశయ్య గిరిజనులను అపహాస్యం చేశారని వారన్నారు. ఏజెన్సీ మరణాలపై రోశయ్య బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. ఏజెన్సీ మరణాలపై తాము ఒక వీడియో డాక్యుమెంటును కూడా రూపొందించినట్లు వారు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X