విచారణ తర్వాత వసంతకుమారి డిస్మిస్: ఎస్వీయు
రాజమండ్రి నుంచి వసంతకుమారి వ్యభిచార కేంద్రానికి అమ్మాయిలను సరఫరా చేస్తున్నవారిని కూడా అరెస్టు చేస్తామని రాజయ్య చెప్పారు. విచారణ అనంతరం వసంతకుమారిపై తగిన చర్యలు తీసుకుంటామని, ఈ సంఘటన యూనివర్శిటీకి కూడా మచ్చలాంటిదని యూనివర్శిటీ అధికార వర్గాలు అంటున్నారు.
వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తోందనే ఆరోపణపై పోలీసులు మంగళవారం వసంతకుమారిని అరెస్టు చేశారు. మ్యారేజ్ బ్యూరో ముసుగులో ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇందుకు సంబంధించి వసంతకుమారితో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వసంతకుమారి విషయంలో మొదట పెద్దయెత్తున ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో వసంతకుమారిపై కేసు పెట్టాలా, వద్దా అనే సంశయంలో పోలీసులు పడ్డారు. చివరకు మంగళవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఆమె కేసు పెట్టారు. ఎస్వీ యూనివర్శిటీ అడల్డ్ ఎడ్యుకేషన్ విభాగంలో వసంతకుమారి ప్రొఫెసర్గా పని చేస్తోంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!