• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రెండో విడత కౌన్సెలింగ్‌ చెల్లుబాటు: హైకోర్టు

By Staff
|

హైదరాబాద్‌: పోస్టు గ్రాడ్యుయేట్‌ (పిసి) మెడికల్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి రెండో విడత జరిపిన కౌన్సెలింగ్‌ మాత్రమే చెల్లుబాటు అవుతుందని హైకోర్టు తీర్పు వెలువరించింది. పిజి మెడికల్‌ సీట్ల భర్తీకి విజయవాడలో వైద్య విశ్వవిద్యాలయం మూడుసార్లు కౌన్సెలింగ్‌ నిర్వహించింది. వీటిలో రెండో విడత జరిపిన కౌన్సెలింగ్‌ మాత్రమే చెల్లుబాటు అవుతుందని జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ రఘురామ్‌లతో కూడిన హైకోర్టు బెంచి స్పష్టం చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన 123వ నెంబర్‌ ఉత్తర్వుల ప్రకారం రెండో విడత కౌన్సెలింగ్‌ జరిగింది.

మొదటి సారి 44 నెంబర్‌ జీవో ప్రకారం సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ జరిపింది. మెరిట్‌ విద్యార్థులకు కూడా సీట్లు రాకపోవడంతో కొందరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని సరిదిద్దాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. దీంతో ప్రభుత్వం 123వ నెంబర్‌ జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం కౌన్సెలింగ్‌ జరపడంతో మొదటిసారి జరిపిన కౌన్సెలింగ్‌లో సీట్లు దొరికిన కొంత మందికి సీట్లు దక్కలేదు. దీంతో కొంతమంది ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. ఆ కారణంగా ప్రభుత్వం 167వ నెంబర్‌ జీవోను జారీ చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ మరికొంత మంది కోర్టు కెక్కారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X