• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏథెన్స్‌ వద్ద కూలిన విమానం: 121 మంది మృతి

By Staff
|

ఏథెన్స్‌: సైప్రస్‌ విమానం ఒకటి గ్రీసు రాజధాని ఏథెన్స్‌ సమీపంలో కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో 121 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో వారందరూ మరణించి వుంటారని అనుమానిస్తున్నారు. ఏథెన్స్‌ సమీపంలోని యూబెయో దీవిలోని పర్వతశ్రేణుల్లో ఈ విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగే సమయంలో విమానం పైలట్లు ఎవరూ లేరని ఏథెన్స్‌ విమానాశ్రయ అధికారి ఒకరు చెప్పారు.

ఏథెన్స్‌ విమానాశ్రయంలో దిగవలసిన ఆ విమానంతో సంబంధాలు తెగిపోయాయని, ఈ విమానాన్ని కాపాడడానికి రెండు యుద్ధవిమానాలను పంపినా ఫలితం లేకపోయింది. ఆ విమానం ఎలా ఎగురుతోందో అర్థం కాలేదని, విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి నెలకొందని అధికార వర్గాలు చెప్పాయి. విమానంలో 115 మంది ప్రయాణికులు, ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారు. విమానం హైజాక్‌ అయి ఉండవచ్చునని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X