• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నర్సిరెడ్డి హత్యకు ప్రభుత్వానిదే బాధ్యత: కల్యాణ్‌

By Staff
|

హైదరాబాద్‌: రెండు వైపుల నుంచి హింస ఆగిపోవాలనేదే తమ ఉద్దేశమని మావోయిస్టుల మాజీ ప్రతినిధి గద్దర్‌ అన్నారు. చర్చలకు విఘాతం కలిగించి మొదట హింసకు పాల్పడింది ప్రభుత్వమేనని ఆయన మక్తల్‌ శాసనసభ్యుడు సి. నర్సిరెడ్డి హత్యపై ప్రతిస్పందిస్తూ అన్నారు. జనశక్తి నేత రియాజ్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌తో ఏ విధమైన సంఘటనైనా జరగవచ్చునని తాము అన్నామని ఆయన అన్నారు. ప్రాథమికంగా తాము చంపడానికి వ్యతిరేకమని ఆయన అన్నారు. రియాజ్‌ ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వం సరైన చర్య తీసుకుని వుంటే నర్సిరెడ్డి హత్య జరిగి వుండేది కాదని ఆయన అన్నారు. బూటకపు ఎన్‌ంటర్లు, గాలింపు చర్యలు ఆపితే తాను ప్రభుత్వం తరఫున పాటలు పాడుతానని ఆయన అన్నారు.

నర్సిరెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని విప్లవ రచయితల సంఘం (విరసం) అధ్యక్షుడు, మావోయిస్టుల మాజీ ప్రతినిధి జి. కల్యాణరావు అన్నారు. ప్రభుత్వ విధానాల వల్లనే ఈ సంఘటన చోటు చేసుకుందని ఆయన అన్నారు. శాంతికి భగ్నం కలిగించింది ప్రభుత్వమేనని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X