వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్యెల్యే నర్సిరెడ్డితో సహా పది మంది హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యుడు చిట్టెం నర్సిరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. నర్సిరెడ్డితో పాటు మరో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నర్సిరెడ్డి కుమారుడు వెంకటేశ్వరరెడ్డి కూడా ఉన్నారు. మున్సిపల్‌ కమీషనర్‌ రామ్మోహన్‌, ఎమ్యెల్యే గన్‌మన్‌ రాజారెడ్డి, వాహనం డ్రైవర్‌ శ్రీను, కాంగ్రెస్‌ కార్యకర్తలు లోకేశ్వర్‌ రెడ్డి, రవీందర్‌ రెడ్డి, మోనప్ప ఆర్డీవో పర్సనల్‌ అసిస్టెంట్‌ సాయిబన్నా ఈ దాడిలో మరణించారు. ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించినట్లు జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌ చెప్పారు. మరో పది మంది గాయపడ్డారు. నర్సిరెడ్డికి 75 యేళ్లు. నక్సల్స్‌ కాల్పుల్లో నర్సిరెడ్డి, ఆయన కుమారుడు వెంకటేశ్వర రెడ్డి అక్కడికక్కడే మరణించారు.

మావోయిస్టు యాక్షన్‌ టీమే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. నారయణపేట్‌లోని ఒక పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరైన నర్సిరెడ్డిపై నలుగురు ఆగంతకులు ఎ.కె. 47తో కాల్పులు జరిపారని యస్పీ చెప్పారు. మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల శాసనసభ్యురాలు డి.కె. అరుణ కుమార్తె. ఇటీవలే నర్సిరెడ్డిని మావ్యోస్టులు హెచ్చరించారు. నర్సిరెడ్డి హత్యతో అందరూ దిగ్బ్రాంతికి లోనయ్యారు. ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు 12 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. దాడిలో ఎనిమిది నక్సలైట్లు పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కల్లు కాంట్రాక్టర్లతో నర్సిరెడ్డికి సంబంధాలున్నాయని, దానిపై నక్సల్స్‌ నర్సిరెడ్డిని హెచ్చరించారని అంటున్నారు.

మక్తల్‌కు బయలుదేరడానికి నిర్ణయించుకున్నారు. నల్లగొండ పర్యటనలో ఉన్న హోం మంత్రి డాక్టర్‌ కె. జానారెడ్డి తన పర్యటనను రద్దు చేసుకుని హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆయన మక్తల్‌కు బయలుదేరారు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్‌ కె. కేశవరావు కూడా మక్తల్‌కు బయలుదేరడానికి సిద్ధమయ్యారు. మక్తల్‌కు అదనపు బలగాలను పంపించారు. హంతకుల కోసం గాలిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నారాయణపేట్‌కు బయలుదేరారు.

నర్సిరెడ్డి శాసనసభ ప్యానెల్‌ స్పీకర్‌గా ఉన్నారు. ఆయన 1978లో జనతాపార్టీ అభ్యర్థిగా మక్తల్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన జనతాదళ్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. చాలా కాలం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయప 1994లో కాంగ్రెస్‌లో చేరి మక్తల్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1999లో కూడా ఆయన ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X