వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేనేత రుణాలపై వడ్డీ మాఫీ: మంత్రి వినోద్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: చేనేత సంఘాల్లో చేనేత కార్మికులు తీసుకున్న రుణాలపై వడ్డీని మాఫీ చేస్తున్నట్లు సంబంధిత శాఖ మంత్రి జి. వినోద్‌ చెప్పారు. 1995 నుంచి ఇప్పటి వరకు తీసుకున్న రుణాలపై ఈ వడ్డీమాఫీని వర్తింపజేయనున్నట్లు ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. వచ్చే ఏడాది మార్చి లోగా చెల్లించే రుణాలపై మాత్రమే వడ్డీమాఫీ వర్తిస్తుందని ఆయన చెప్పారు.

వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పద్ధతిలో రుణాలపై వడ్డీని మాఫీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన చేనేత కార్మికులను కోరారు. భవిష్యత్తులో చేనేత రంగం విశేషంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X