వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వ్యాపారితో పాటు భార్యాపిల్లల ఆత్మహత్య
కరీంనగర్: కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన ఒక వ్యాపారి తన కుటుంబసభ్యులతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. ఎరువుల వ్యాపారి సిరిపురం శ్రీనివాస్, ఆయన భార్య సిరిపురం పద్మ, వారి ఇద్దరు పిల్లలు శ్రీరాంసాగర్ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధ తట్టుకోలేకనే సిరిపురం శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు.
శ్రీనివాస్ రైతులకు 20 లక్షల రూపాయల మేరకు ఎరువులను అప్పుగా ఇచ్చాడని, వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు పండక రైతులు అప్పులు చెల్లించలేకపోయారని, శ్రీనివాస్ 50 లక్షల రూపాయల మేరకు అప్పులు చేశాడని, అప్పులను చెల్లించాలని ఒత్తిడి పెరిగిందని, దీంతో అతను తన కుటుంబసభ్యులతో పాటు ఆత్మహత్య చేసుకున్నాడని వివరిస్తున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!