• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దగ్గరలోనే ప్రజాదర్బార్‌లో కాంగ్రెస్‌ ద్రోహి: నరేంద్ర

By Staff
|

సంగారెడ్డి: ప్రజాదర్బార్‌లో కాంగ్రెస్‌ దోషిగా నిలబడే రోజు దగ్గరలోనే వుందని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్‌) నాయకుడు, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర వ్యాఖ్యానించారు. సంగారెడ్డిలో పార్టీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి ఆయన సోమవారం నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఏడాదిన్నర పాటు రాజశేఖర్‌ రెడ్డి నియంతృత్వ పోకడలను భరించామని, ఇక ఏ మాత్రం సహించలేకనే తమవారు మంత్రి పదవులకు రాజీనామాలు చేశారని ఆయన అన్నారు. బాటలు, యాత్రలు తప్ప రాజశేఖర్‌ రెడ్డి ఎవరికీ ఏమీ ఇవ్వలేదని ఆయన అన్నారు.

తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్‌ పార్టీని చిత్తుగా ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రకు కట్టుబడి వున్నామని ప్రకటించిన తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. తాము దంచేది తెలంగాణ ద్రోహులనేనని ఆయన అన్నారు. తెలంగాణ జాగరణ సేన సభ్యులకు శారీరక, మానసిక శిక్షణ ఇస్తున్నామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బాటలోనే నడుస్తున్న ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డికి ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X