• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐయంజికి భూమి కేటాయింపుపై విచారణకు సిద్ధం: బాబు

By Staff
|

కర్నూలు: ఐయంజి కంపెనీకి తమ ప్రభుత్వం భూమి కేటాయించిన విషయంపై ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం విచారణ జరిపించుకోవచ్చునని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన గురువారంనాడు కర్నూలు జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే ఐయంజికి భూమి కేటాయించామని ఆయన చెప్పారు. కావాలనుకుంటే ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవచ్చునని ఆయన అన్నారు. ఐయంజికి భూమి కేటాయింపులో ఏ విధమైన అక్రమాలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

తమ పార్టీ నేతల హత్యలు ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ఫాక్షన్‌ సంస్కృతికి నిదర్శనమని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కమీషన్ల కోసమే ముఖ్యమంత్రి ప్రాజెక్టుల బాట చేపడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌) నాయకులు విమర్శలు చేస్తున్నా పట్టించుకోకపోవడం కాంగ్రెస్‌ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X