వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపితో పొత్తు అవకాశాలు లేవు: నారాయణ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు భవిష్యత్తులో కూడా లేవని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ విధానాల్లో సానుకూల మార్పు వచ్చినప్పుడు ఆలోచిస్తామని, అలాంటి మార్పేదీ తెలుగుదేశం విధానాల్లో వచ్చే అవకాశం లేదని ఆయన గురువారం మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో అన్నారు. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. బూర్జువా పార్టీలతో తమ స్నేహం ఎప్పుడూ శాశ్వతం కాదని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌) రాజకీయ మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. ఇష్టానుసారం మాట్లాడుతున్న టిఆర్‌యస్‌కు కేంద్ర ప్రభుత్వంలో కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న టిఆర్‌యస్‌ నేత ఎ. నరేంద్ర చేస్తున్న ప్రకటనలు ఏ మాత్రం సమర్థనీయం కాదని ఆయన అన్నారు. నరేంద్ర లాగా సామాన్యులు ఎవరైనా మాట్లాడితే పోలీసు శాఖ, కోర్టులు ఊరుకుంటాయా అని ఆయన అడిగారు. ఏమీ తెలియని సామాన్యులు మాట్లాడితే కొంత అర్థం ఉందని, నరేంద్రలాంటి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మాట్లాడటం ఏ విధంగా సమర్థనీయమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X