శాంతి ప్రక్రియ కొనసాగింపు: మన్మోహన్, ముషారఫ్
ఉగ్రవాదం శాంతి ప్రక్రియకు ఆటంకం కలిగించకుండా చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు. ఉభయ దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకోవాలని, ఇరు దేశాల ప్రజలకు మధ్య సంబంధాలు నెలకొల్పి విశ్వాసం పెంపొందిచుకునే చర్యలను పటిష్టం చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. సమస్యల పరిష్కారానికి నిజాయితీతో కూడిన స్ఫూర్తితో, ప్రయోజనకరమైన పద్ధతిలో కృషి చేస్తామని వారు చెప్పారు.
తాను భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌ను పాకిస్థాన్ పర్యటనకు ఆహ్వానించినట్లు, అందుకు మన్మోహన్ సింగ్ అంగీకరించినట్లు ముషారఫ్ తెలిపారు. చర్చలు తనకెంతో సంతృప్తినిచ్చాయని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేయడానికి వారు అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ ప్రకటన సరిపోతుందని ముషారఫ్ చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!