వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒంగోలులో ఎపిసియల్‌సి నేత కిడ్నాప్ వదంతులు
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులోని విజయనగర్ కాలనీలోని తన ఇంటి నుంచి ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం (ఎపిసియల్‌సి) అధ్యక్షుడు అనిల్‌కుమార్ కిడ్నాప్‌నకు గురైనట్లు వదంతులు చెలరేగాయి. ఆయనను కోబ్రాస్ కిడ్నాప్ చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో వేటపాలెం, గంజాం తదితర ప్రాంతాల్లో పోలీసులు వాహనాల తనిఖీని ముమ్మరం చేసినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి.
అయితే తాను క్షేమంగానే ఉన్నానని, తాను ఎవరూ కిడ్నాప్ చేయలేదని అనిల్‌కుమార్ ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ ప్రతినిధితో చెప్పారు. పోలీసులు, కోబ్రాస్ కలిసి తన కిడ్నాప్ డ్రామా ఆడారని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఏవైనా సంఘటనలు జరిగితే తప్పించుకోవడానికి పోలీసులు ఈ నాటకం ఆడారని ఆయన అన్నారు. తాను లేని సమయంలో తన ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించి, కొన్ని డైరీలు, పుస్తకాలు తీసికెళ్లారని ఆయన చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!