వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై కాంగ్రెస్‌ వైఖరి చెప్పాలి: బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణపై కాంగ్రెస్‌ తన వైఖరిని స్పష్టం చేయాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) శాసనసభ్యుడు జి. కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణపై కాంగ్రెస్‌, తెలంగాణ రాష్ట్ర సమితి ఎటూ తేల్చుకోలేకపోతున్నాయని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ పేరు మీద మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని ఆయన అన్నారు.

బిజెపితో పొత్తు వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అనడాన్ని ఆయన ఖండించారు. బిజెపితో పొత్తు వల్ల మైనారిటీల ఓట్లు రాలేదని చంద్రబాబు అనడాన్ని ఆయన వ్యతిరేకించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారని ఆయన అన్నారు. మైనారిటీ ఓట్లు లేని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయిందో చంద్రబాబు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X