• search

తొలి టెస్టు: జింబాబ్వేపై భారత్‌ ఘనవిజయం

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    బులవాయో: జింబాబ్వేపై తొలి క్రికెట్‌ టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్సు 90 పరుగుల ఆధిక్యతతో జింబాబ్వే క్రికెట్‌ జట్టును భారత జట్టు మట్టి కరిపించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 279 పరుగులు చేసిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే కెప్టెన్‌ తైబు, బ్లెగ్నాట్‌ పోరాటం ఓటమిని తప్పించలేకపోయింది. భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 554 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ వివియస్‌ లక్ష్మణ్‌ 140 పరుగులు, కెప్టెన్‌ గంగూలీ 101 పరుగులు చేశారు. ద్రావిడ్‌ 77 పరుగుల వద్ద అవుటయ్యారు. భారత ఓపెనర్లు అందించిన శుభారంభంతో మిడిల్‌ ఆర్డర్‌ రాణింపుతో భారత్‌ భారీ స్కోర్‌ చేయగలిగింది. ఇర్ఫాన్‌ పఠాన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. హర్భజన్‌ రెండు వందల వికెట్ల మైలు రాయిని దాటాడు. అతను ఇప్పటి వరకు టెస్టుల్లో 203 వికెట్లు తీశాడు.

    పఠాన్‌ ఆల్‌ రౌండ్‌ ప్రతిభను కనబరిచాడు. పఠాన్‌ టెస్టు మ్యాచ్‌ల్లో తన రెండో అర్థ సెంచరీని నమోదు చేసుకున్నాడు. జింబాబ్వే బ్యాటింగ్‌ను కుప్పకూల్చడంలో పఠాన్‌ ప్రధాన పాత్ర పోషించాడు. ఇతను నాలుగు వికెట్లు తీసుకోగా స్పిన్నర్‌ హర్భజన్‌కు కూడా నాలుగు వికెట్లు వచ్చాయి. దీంతో భారత విజయం సునాయసమైంది. తైబు 52 పరుగులు చేశాడు. 18 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయిన జింబాబ్వేను కెప్టెన్‌ తైబు, బ్లెగ్నాట్‌ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. చివరి వికెట్‌ పడగొట్టడానికి భారత బౌలర్లు కాస్తా శ్రమించాల్సి వచ్చింది. ఎవింగ్‌ ధాటికి ఆడుతూ భారత విజయాన్ని కాస్తా ఆలస్యం చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లను కాస్తా ధాటిగానే ఎదుర్కున్న జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో ఆ తెగువ చూపలేకపోయింది.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more