వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరెస్టు చేయండి, తడాఖా ఏమిటో చూపిస్తాం: నరేంద్ర

By Staff
|
Google Oneindia TeluguNews

మెదక్‌: దమ్ముంటే తమ నేత కె. చంద్రశేఖర్‌రావును, తనను అరెస్టు చేయాలని, అప్పుడు తమ తడాఖా ఏమిటో చూపిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌) నాయకుడు, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర సవాల్‌ చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు పదవులను ప్రసాదంలా పంచిపెట్టి ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి వారిని తమ మీదికి ఉసిగొల్పుతున్నారని ఆయన విమర్శించారు. జలదోపిడీ చేస్తున్న ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి నేరస్థుడు కాడా అని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డి ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తూ గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారని ఆయన అన్నారు. వైయస్‌ ఫ్యాక్షన్స్‌ను ప్రోత్సహించడం నేరం కాదా అని ఆయన అడిగారు. తెలంగాణలో ఆధారం దొరక్క కాంగ్రెస్‌, తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీలు, బిజెపి తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. కమ్యూనిస్టులకు ఒకరిపై ఒకరు ఆధారపడితే తప్ప దిక్కు లేదని ఆయన అన్నారు. గుమ్మడి కాయల దొంగలంటే కమ్యూనిస్టులు భుజాలు తడుముకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X