వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవగాహనకు టిడిపి సంకేతాలు: సిపిఐ

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల్లో అవగాహనకు తెలుగుదేశం పార్టీ సంకేతాలు పంపుతోందని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ చెప్పారు. స్థానికంగా అవగాహనకు వచ్చి మున్సిపల్‌ పదవులను దక్కించుకుందామని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తాము తెలుగుదేశం పార్టీతో జత కట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో తాము అనుసరించిన విధానం విజయవంతమైందని, అదే విధానాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. పదవుల కోసం తమ విధానానికి భిన్నంగా వ్యవహరించలేమని, అందువల్ల తెలుగుదేశం పార్టీతో ఎక్కడ కూడా జత కట్టే ప్రశ్న లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X