వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం కొనుగోళ్ల స్కామ్‌: బాబుపై సుప్రీంలో పిటిషన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మద్యం కొనుగోళ్లలో జరిగిన అవినీతిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి పాత్రపై కాంగ్రెస్‌ మంగళవారంనాడు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. కాంగ్రెస్‌ నాయకుడు కృష్ణకుమార్‌ గౌడ్‌ ఈ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తూ అందుకు బాధ్యలైన వారికి నోటీసులు జారీ చేసింది.

గతంలో ఈ కేసును హైకోర్టు కొట్టేసింది. దీంతో కాంగ్రెస్‌ ఆ తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. మద్యం కొనుగోళ్ల కుంబకోణంపై చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విచారణకు అవినీతి నిరోధక శాఖ ( ఎసిబి)కి అప్పగించక పోవడంలోని ఆంతర్యమేమిటని పిటిషనర్‌ ప్రశ్నిస్తున్నారు. ఇది 550 కోట్ల రూపాయల కుంభకోణమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X