కరీంనగర్ జిల్లాలో నక్సల్ ఎన్‌కౌంటర్
ఎస్టీ, ఎస్సీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీపైన కూడా వాగ్వివాదం నడిచింది. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయకపోవడంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు నగేష్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వ విధానాన్నే అనుసరిస్తోందని ఆయన విమర్శించారు. వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ లోగా వాటిని భర్తీ చేస్తామని మంత్రి రెడ్యా నాయక్ ఇచ్చిన సమాధానంతో నగేష్ సంతృప్తి చెందలేదు. ఈ విషయమై సభా సంఘానికి నివేదించి సాధ్యమైనంత త్వరగా నివేదిక తెప్పించుకుంటామని మంత్రి చెప్పారు.
మద్యం బెల్టు షాపుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిపియం సభ్యుడు నోముల నర్సింహయ్య సభ దృష్టికి తెచ్చారు. బెల్టు షాపులను ఒక పద్ధతి ప్రకారం నిరోధిస్తామని మంత్రి కొణతాల రామకృష్ణ హామీ ఇచ్చారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!