వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాతబస్తీలో బ్లాక్డే : పాతబస్తీ రోడ్లు నిర్మానుష్యం
హైదరాబాద్: అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా మంగళవారం హైదరాబాద్లోని పాతబస్తీలో బంద్ జరిగింది. బ్లాక్ డే సందర్భంగా మంగళవారం పాతబస్తీలో కనీవినీ ఎరుగని రీతిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవాలయాలు, ఇతర చారిత్రక కట్టడాల వద్ద భద్రతను రెట్టింపు చేశారు. బ్లాక్ డే సందర్భంగా పాతబస్తీ రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి.
పాతబస్తీలో ర్యాలీలను పోలీసులు అనుమతించలేదు. ఇందిరా పార్క్ వద్ద నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతించారు. దీంతో కొన్ని సంస్థల ఆధ్వర్యంలో సైదాబాద్ నుంచి వాహనాల్లో ఇందిరాపార్క్ వరకు ర్యాలీ జరిగింది. బ్లాక్ డే సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేశారు. 1992 డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా కొన్ని సంస్థలు బ్లాక్ డేకు పిలుపునిచ్చాయి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!