వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చుట్టం చుట్టమే, చట్టం చట్టమే: రోశయ్య
విశాఖపట్నం: రాష్ట్ర ఆర్ధిక మంత్రి రోశయ్య తన అల్లుడిని సమర్ధించుకోడానికి పరోక్షంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించారు. నిన్నరాత్రి ఒక విశాఖలోని ఒక హోటల్లో అశ్లీల నృత్యాలను వీక్షిస్తూ రోశయ్య అల్లుడు దొరికిపోయిన విషయం తెలిసిందే. అల్లుడు గారి నిర్వాకం గురించి శనివారం విలేకరులు రోశయ్యను ప్రశ్నించగా, ఆయన తొమ్మిదేళ్ళ తెలుగుదేశం పాలనలో అశ్లీలాన్ని అరికట్టకపోవడం వల్లనే ఇటువంటి ధోరణులు తలెత్తుతున్నాయని ఆయన చెప్పారు. అయినా చట్టానికి ఎవరూ అతీతులు కారని, తన అల్లుడైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని రోశయ్య అన్నారు.
Comments
Story first published: Saturday, December 10, 2005, 23:53 [IST]