వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వ్యవసాయానికి సబ్సిడీలు అవసరం: బాబు
చెన్నై: వ్యవసాయ రంగానికి పెట్టుబడులు, రాయితీలు, సబ్సిడీలు పెంచాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. చెన్నైలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని అభివృద్ధిపై పవర్ ప్రజెంటేషన్‌తో వివరించారు.
వరుసగా గత నాలుగేళ్లు నెలకొన్న కరవు వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి సబ్సిడీలు అవసరమని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్య, ఆరోగ్య రంగాల్లో సాధించిన ప్రగతి గురించి ఆయన వివరించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!