• search

అసెంబ్లీ నుంచి టిడిపి రెండుసార్లు వాకౌట్‌

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సోమవారంనాడు రెండు సార్లు శాసనసభ నుంచి వాకౌట్‌ చేశారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై ఒకసారి, ఇందిరమ్మ పథకంపై రెండోసారి వారు వాకౌట్‌ చేశారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు వంద నుంచి నూటా యాభై శాతం వరకు పెరిగాయని ఆయన అన్నారు.

    తెలుగుదేశం వాదనను మార్కెటింగ్‌ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ వ్యతిరేకించారు. భారీ వర్షాల వల్ల కూరగాయలు, తదితర నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన మాట వాస్తవమేనని, అయితే ప్రభుత్వం తగిన చర్యలను చేపట్టి ధరలను తగ్గించగలిగిందని ఆయన అన్నారు. ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

    ఇందిరమ్మ పథకాన్ని కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల కోసమే అమలు చేస్తున్నారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రెండో సారి సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఇందిరమ్మ పథకంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదప్రతివాదాలు నడిచాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని తెలుగుదేశం విమర్శించింది.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more