• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శ్రీలంకపై భారీ ఆధిక్యతతో భారత్‌ గెలుపు

By Staff
|

న్యూఢిల్లీ: శ్రీలంకపై భారత్‌ రెండో టెస్టులో 188 పరుగుల భారీ ఆధిక్యతతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్లు శ్రీలంక వికెట్లను తీసి సునాయాస విజయాన్ని సాధించి పెట్టారు. కుంబ్లే రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీయగా, హర్బజన్‌ మూడు వికెట్లు తీశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన అనిల్‌ కుంబ్లే మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆల్‌ అవుట్‌ అయింది.

ఐదు వికెట్ల నష్టానికి 123 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో బుధవారం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 247 పరుగులకు ఆల్‌ అవుట్‌ అయింది. భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 290 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌ను 375 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 230 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత విజయాన్ని నిరోధించడానికి శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరి మూడు వికెట్లను ఆరు పరుగులకే పడగొట్టి హర్బజన్‌ భారత్‌కు ఆలస్యం కాకుండా విజయాన్ని అందించాడు. ఈ విజయంతో భారత్‌ 1-0తో సిరీస్‌లో ఆధిక్యతను సాధించింది. మూడో టెస్టు ఈ నెల 18వ తేదీన అహ్మదాబాద్‌లో ప్రారంభమవుతుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more