క్రికెట్: శ్రీలంకపై భారత్ సిరీస్ విజయం
భారత్ ఉంచిన 509 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు చేతులెత్తేసింది. బుధవారం ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసిన శ్రీలంక గురువారం ఆర గంట లోపలే మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. భారత స్పిన్ మాంత్రికులు ఇద్దరు 7.3 ఓవర్లలోనే మిగతా నాలుగు వికెట్లు తీసి భారత్‌కు సునాయసమైన విజయాన్ని అందించారు. ఈ ఇద్దరూ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
తన క్రికెట్ జీవితంలో వందో టెస్టు ఆడిన అనిల్ కుంబ్లే టెస్టు మ్యాచ్‌ను గొప్పగా ఎప్పుడూ గుర్తుండేలా చేసుకున్నాడు. శ్రీలంక చివరి వికెట్ మాలింగ బండారాను అవుట్ చేయడం ద్వారా తన కెరీర్‌లో 31వ సారి ఐదు వికెట్లు తీసుకున్న ఘనత సాధించారు. మరో 15 వికెట్లు తీసుకుంటే కుంబ్లే 500 వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో చేరిపోతాడు. రెండో ఇన్నింగ్స్‌లో హర్బజన్ మూడు వికెట్లు తీసుకున్నాడు.
చెన్నైలో జరిగిన మొదటి టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగియడంతో, ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!